బుచ్చయ్యపేట: ఘనంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు

80చూసినవారు
బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాదిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు శుక్రవారం మహర్నవమి సందర్భంగా బ్రాహ్మణ వీధిలో పొగాకు వర్తక సంఘం నిర్వహించిన మండపంలో అమ్మవారికి కుంకుమార్చనలు, పంచామృతాభిషేకాలు జరిగాయి. అర్చకులు ఎమ్. కృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, పండ్లు, గాజులు, స్వీట్లు సమర్పించి మొక్కులు చెల్లించారు.

సంబంధిత పోస్ట్