ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ మహిళల రెజ్లింగ్ పోటీల్లో చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్యూటర్ చదువుతున్న గాయత్రి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కిరణ్ కుమార్ ఇతర అధ్యాపక బృందం ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గాయత్రికి సెకండ్ ఇయర్ లో ఇది రెండో విజయమన్నారు.