చోడవరం.. నేటి నుంచి గ్రామ సభలు

83చూసినవారు
చోడవరం.. నేటి నుంచి గ్రామ సభలు
రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారానికి ఈ నెల 16 నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నట్టు చోడవరం తహసిల్దార్ ఏ రామారావు బుధవారం విలేకరులకు తెలిపారు. గురువారం చోడవరంలో వెంకయ్య గారి పేట అన్నవరం గ్రామాలలో గ్రామసభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభలో భూ సమస్యలతో పాటు రిసర్వే సమస్యలు తో పాటు రెవెన్యూపరమైన ఎలాంటి సమస్యలున్న సభ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్