రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కొండశిఖర గ్రామమైన చలిసింగం గ్రామాన్ని శనివారం అనకాపల్లి డీఎఫ్ఓ ఎం. శామ్యూల్ పరిశీలించారు. ఆరు కిలోమీటర్లు కాలినడకన ఎత్తైన కొండలు ఎక్కి గ్రామానికి చేరారు. ఇటీవల ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చోడవరం రేంజ్ ఆఫీసర్ పీవీ. వర్మ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు పాల్గొన్నారు.