అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గర్నికం గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండు వరికుప్పలు దగ్ధమవగా, వీటిని కేసం శెట్టి రమణకు చెందినవిగా ఫైర్ సిబ్బంది గుర్తించారు. స్థానికుల సహకారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేయడం జరిగింది. మంటల కారణంగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.