ఉమ్మడి విశాఖ జిల్లాకు భారీ వర్ష సూచన!

71చూసినవారు
ఉమ్మడి విశాఖ జిల్లాకు భారీ వర్ష సూచన!
ఏపీకి తుపాన్ ముప్పు ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ఈ నెల 5న తీవ్ర తుపానుగా మారనుంది. ఒడిశా, బెంగాల్ తీరాల సమీపంలో ఈ తుపాను తీరం దాటనుందని పేర్కొంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్