రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిరుధాన్యాలను ఉపయోగించి విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తయారు చేశారు. గత ఐదు రోజులుగా ఆయన ఎంతో శ్రమించి కేవలం సహజసిద్ధమైన మిల్లెట్స్ ను ఉపయోగించి ఈ చిత్రపటాన్ని తయారు చేయడం విశేషం. ఏడాదికాలంగా విజయకుమార్ మిల్లెట్స్ ఉపయోగించి ప్రముఖులచిత్రపటాలనుతయారు చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రపటాన్ని చంద్రబాబుకు పంపించారు