విశాఖ: నలుగురికి ప్రాణదానం చేసిన చిన్నారి

71చూసినవారు
గంట్యాడ మండలం మురపాకకి చెందిన గండి పల్లవి(12) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందింది. చిన్నారి అవయవాలను అంబులెన్సులో గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖకు తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల అంగీకారం మేరకు విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి శుక్రవారం అవయవాలను తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు.. పల్లవి అమర్ రహే అంటూ దారి పొడవునా అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్