విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ లో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి శ్యాంసుందర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. విప్రో సొల్యూషన్, అప్రోటెక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 35 వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.