విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వత పరిష్కారం చూపించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు వి. శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కూర్మన్నపాలెం వద్ద కార్మికుల చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1440వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని సందర్శించిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలన్నారు. ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలన్నారు.