ప్రజలకు మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు అన్నారు. గురువారం ఉడా కాలనీ వినాయక నగర్ లో రూ 20 లక్షల రూపాయల నిధులతో హెచ్ డిపిఈ పైప్ లైన్ కు ఆయన శంకుస్థాపన చేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.