విశాఖ జీవీఎంసీ 69వ వార్డు పరిధి తుంగాల్లాం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా పరిష్కారం కావడం లేదు. దీంతో కాపు తుంగల్లం యొక్క మురుగు నీటి ప్రధాన అవుట్ లెట్ సమస్యను, గ్రామం రహదారి కనెక్టివిటీని షీలా నగర్ రైల్వే అండర్ బ్రిడ్జికి కలపమని గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు.. జీవీయంసీ అధికారులకు సమస్య తీవ్రతను శుక్రవారం వివరించారు 69వ వార్డు కూటమి నాయకులు కరణం ముత్యాలనాయుడు.