ముగిసిన విశ్వకర్మ జయంతోత్సవాలు

81చూసినవారు
ముగిసిన విశ్వకర్మ జయంతోత్సవాలు
విశ్వకర్మ జయంతోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిసాయి. ఈనెల18వ తేదీన ఈ ఉత్సవాలు మాడుగుల జగ్గన్న చావడి వద్ద గల బ్రహ్మంగారి ఆలయంలో ప్రారంభించారు. 5 రోజులపాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజనలు పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఆదివారం సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవము పురవీధుల్లో నిర్వహించారు. రాత్రి నామ సంకీర్తనతో ఉత్సవాలు ముగించారు. ఈఉత్సవాలు మోద కామాక్షి స్వర్ణకార సంఘం, విశ్వబ్రాహణ సంఘం నిర్వహించారు

సంబంధిత పోస్ట్