మాడుగుల మండలంలో వడ్డాది తాటిపర్తి ఆర్ అండ్ బి ప్రాజెక్టు రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. వడ్డాది నుంచి సుమారు 13 కిలోమీటర్ల మేర తాటిపర్తి వరకు ఏడున్నర మీటర్ల రోడ్డును 23 కోట్ల 59 లక్షలతో నిర్మించనున్నారు ఇప్పటికే రోడ్డు పనులకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో జంగిల్ క్లియరెన్స్ త్వరగా పూర్తిచేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు ఎమ్మెల్యే బండారు సూచించారు