జీడీ పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చేల్లించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా దశలవారీగా జీడి రైతులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీలో పర్యటించి స్తానిక గిరిజనులతో కలిసి, జీడీ తోటలను పరీశీలించారు.