మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన బాలికల వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న అల్లూరి జిల్లా అయినాడ పంచాయితీ చీమలపల్లి గ్రామ విద్యార్థిని ముర్ల సత్యవతి శుక్రవారం మృతి చెందింది. ఐదు రోజులుగా అనారోగ్యoతో బాధపడుతుండగా సకాలంలో వైద్యం అందక మృతి చెందిందని తెల్లిదండ్రులు, గిరిజన సంఘం మండిపడుతూ, పరిహారం డిమాండ్ చేశారు. హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు, అదికారులు హాస్టల్ వద్దకు చేరుకోనీ పరిశీలించారు.