నక్కపల్లి మండలంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఏ పరిశ్రమనైనా ఏర్పాటు చేయాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకుండా స్టీల్ ప్లాంట్ ను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోతున్న వారందరికీ ఎక్కడ పునరావసం కల్పిస్తారో ముందు చెప్పాలన్నారు.