మాకవరపాలెం మండలం గిడుతూరు- బయ్యవరం సమీప మామిడి తోటలో జరుగుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం సాయంత్రం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. నర్సీపట్నం-తాళ్లపాలెం ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద పేకాట జరగడం పట్ల స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఈదాడిలో 69, 270 నగదు 11 ద్విచక్ర వాహనాలు 2 కార్లు సంఘటనా స్థలంలో సిజ్ చేసి 5గురు నిందితులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులుతెలిపారు.