నర్సీపట్నం ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏజెంట్లు గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏజెంట్లు మాట్లాడుతూ ఐఆర్డీఏను అడ్డుపెట్టుకుని ఎల్ఐసీ అమలు చేస్తున్న హానికరమైన మార్పులకు నిరసన చేస్తున్నామన్నారు. వచ్చే నెల తొమ్మిదో తారీఖున విశాఖలో నిర్వహించబోయే మహా ధర్నా కార్యక్రమానికి ఎల్ఐసీ ఏజెంట్లు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.