నర్సీపట్నం: సమగ్ర శిక్ష అధికారులతో సమావేశం

52చూసినవారు
నర్సీపట్నం: సమగ్ర శిక్ష అధికారులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం నర్సీపట్నంలో సమావేశమయ్యారు. స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాఠశాలల ప్రహరీ గోడల కోసం ఎన్ఆర్డీఎస్ నిధుల నుంచి 3 మండలాలకు 29 పనులకు రూ. 3. 82 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్