నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలకు జనసేన అభ్యర్థులు సన్నద్ధం కావాలని మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెలగల వెంకటరమణ కోరారు. శనివారం నాతవరంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. తాండవకు ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 27 నీటి వినియోగదారుల సంఘాలు, 324 ప్రాదేశిక సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందాలని చెప్పారు.