మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దాడులను అరికట్టాలని నర్సీపట్నంలో మహిళా సంఘాలు బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా నాయకురాలు గౌరీ మాట్లాడుతూ మొన్న కలకత్తా లో జూనియర్ మహిళా డాక్టర్ పై, నేడు పాములవాకలో బాలికపై ఇలా రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.