ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాత్రి తన నివాసం నర్సీపట్నంలో కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, రాజేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీపావళి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు విరజిల్లాలని ఆకాంక్షించారు.