AP: విజయవాడలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో ఏ-1గా ఉన్న ఓలుపల్లి రంగారావును మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. రంగారావును బుధవారం విజయవాడ కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.