విశాఖ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
విశాఖ నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండగను సంప్రదాయ రీతిలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగర పరిశుభ్రతకు అందరూ సహకరించాలని సూచించారు. అలాగే అధికారులకు, జీవీఎంసీ సిబ్బందికి కూడా ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు