నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు , నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బుధవారం కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.