ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు, మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న జనాభాకు, ఓటర్లకు మధ్యనున్న వ్యత్యాసానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గరువారం విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.