కొయ్యూరు మండలంలోని చిట్టెంపాడు పంచాయతీ పరిధి రామన్నపాలెంలో ఉన్న ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నోటుబుక్స్ పెన్నలు పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యుడు ప్రసాద్ మాట్లాడుతూ. దానధర్మ ట్రస్ట్ ద్వారా మండలంలోని అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ ట్రస్ట్ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.