పాడేరు మండలంలోని మొదపల్లి గుర్రగరువు తదితర గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున భోగిమంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం నేతలు ట్రూ ఆప్ చార్జీలను పెంచిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని అదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. పంచాయతీ నేత లక్కు మాట్లాడుతూ విద్యుత్ భారాలతో రైతులపై మరింత భారం పడుతుందన్నారు.