పాడేరు: గాలిపాడు గిరిజనులకు రహదారి కష్టాలు

57చూసినవారు
అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. పాడేరు మండలంలోని మోదపల్లి పంచాయతీ పరిధి గాలిపాడుకి సరైన రహదారి సౌకర్యం లేక వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే గృహ నిర్మాణం కొరకు గిరిజనులంతా కలిసి సోమవారం మోదపల్లి నుంచి గాలిపాడు వరకు మిల్లర్ ను లాగి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి గాలిపాడుకి రహదారి నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్