ఇచ్చిన మాట ప్రకారం వర్షాలు తగ్గిన వెంటనే తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించిన ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ కు గరిమండ సర్పంచ్ ముత్యాలమ్మ, వార్డు సభ్యులు సంజీవ్ పలువురు గిరిజనులు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. గరికబంధ జంక్షన్ నుండి మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గరిమండకు వచ్చే రెండు కిలోమీటర్ల రహదారి ఇటీవల వర్షాలకు బురద మయంగా మారి అధ్వానంగా తయారయింది. దీంతో సమస్యను పివో పరిష్కరించారన్నారు.