చినుకు పడితే చిత్తడే.. వాహనచోదకుల కష్టాలు

68చూసినవారు
చినుకు పడింది అంటే చాలు మండల కేంద్రమైన కోటవురట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి వర్షపు నీటితో చిత్తడిగా ఉంటుంది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి చెరువుని తలపించింది. వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనచోధకులు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా కాలువ లేకపోవడమే ప్రధాన కారణమని వర్షం వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనచోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్