బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం అన్నదాతలకు గుబులు పుట్టిస్తుంది. అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో కోసి పొలాలపై ఉన్న వరి పనలను రైతులు మంగళవారం కోటవురట్ల మండలంలో కుప్పలుగా వేస్తున్నారు. కూలీల కొరత కారణంగా పలువురు రైతులు వరి పనలను పొలాలలోనే వదిలివేశారు. కొందరు రైతులు కోతలను వాయిదా వేసుకున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే పంట తీవ్రంగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.