విద్యార్థులు చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో మెలగాలని ఎస్సై రమేష్ బాబు అన్నారు. కోటవురట్ల ప్రభుత్వ కళాశాల, ఉన్నత పాఠశాలలో మంగళవారం సంకల్పం అనే కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల మత్తులో పడవద్దని, మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.