కోటవురట్ల, నర్సీపట్నంలో సబ్ ట్రెజరీ భవనాలు నిర్మాణంలో ఉన్నట్లు అనకాపల్లి జిల్లా ట్రెజరీ అధికారిణి లక్ష్మీ సుభాషిణి వెల్లడించారు. కోటవురట్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ. 75 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సాంకేతిక సమస్యతో నక్కపల్లి ట్రెజరీ భవనం, స్థల సమస్యతో అనకాపల్లి ఈస్ట్ కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు.