టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వరస్వామిని పుణ్యకోటి వాహనంలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య మాడవీధుల్లో ఊరేగించి తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు పాల్గొన్నారు.