నక్కపల్లి మండలం జానకయ్యపేట, దేవవరం గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశు వైద్య శిబిరాలను ప్రారంభించిన పశుసంవర్ధక ఏడీ డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ పశువులకు సోకే దీర్ఘకాలిక వ్యాధులకు ఇతర వ్యాధులకు పశు వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువుల పరీక్షించి చికిత్స అందిస్తారన్నారు. పశువులకు సోకే వ్యాధులపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు.