ఇటీవల సన్యాసాశ్రమం స్వీకరించిన కర్ణాటక రాష్ట్రం మెల్కోటకు చెందిన త్రిదండి శఠగోపముని చిన్న జీయర్ స్వామి శనివారం ఉపమాకలో ఉన్న కల్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఇక్కడకు వచ్చినట్లు జీయర్ స్వామి తెలిపారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేసిన అనంతరం ఆయన పాయకరావుపేట పాండురంగ స్వామి ఆలయానికి వెళ్లారు.