రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సబ్బవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిసి కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపాలని సూచించారు.