రంపచోడవరం నియోజకవర్గంలోని ఊట్ల క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం గోకవరం మండలంలోని గంగపాలెం పంచాయతీ పరిధి ఠాకూర్ పాలెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య దొర అనే వ్యక్తి.. ఊట్ల వెలమలకోట మధ్య ఉన్న క్వారీలో పనికి వెళ్లినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.