జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు శుక్రవారం నగరంలో అల్లిపురం బానోజీ నగర్, మురళీ నగర్ ప్రాంతాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా చేశారు. దోమల నివారణకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.