విశాఖలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీవీఎంసీ స్థాయీ సంఘం సుమారు రూ. 20. 06 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. స్థాయీ సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి ఆధ్వర్యంలో మంగళవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. వెంకట కుమారి మాట్లాడుతూ 280 అంశాలతో కూడిన అజెండాను పొందుపరచగా, సభ్యులు చర్చించగా 224 అంశాలను ఆమోదించారని, మిగిలిన అంశాలు వివిధ కారణాల వలన వాయిదా వేసినట్టు తెలిపారు.