ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఏ యూ గ్రౌండ్స్ కు చేరుకునే మార్గంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు భారీగా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు కూటమి పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. నిగరమంతా కూటమి జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడుతోంది. మంగళవారం ఉదయం రాత్రి నుంచే ఏర్పాట్లలో అటు అధికారులు, ఇటు కూటమి నేతలు నిమగ్నమయ్యారు.