ఈనెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను విశాఖ అల్లిపురం వెంకటేశ్వర్ల మెట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. వి. రమాబాయి గురువారం తెలిపారు. 10 తేదీ తెల్లవారుజామున ఒంటిగంట నుంచి ఆరాధన, నివేదన, 3 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, ఆలయ మండపంలో ప్రథమ అర్చన, సహస్రనామార్చన నిర్వహించనున్నట్లు వివరించారు.