విశాఖ: భారీగా గంజాయి పట్టివేత

75చూసినవారు
విశాఖ: భారీగా గంజాయి పట్టివేత
విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు రైలులో అక్రమంగా రవాణా చేసేందుకు దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద సిద్ధంగా ఉంచిన రూ13 లక్షల విలువ గల 102 కిలోల గంజాయితో పాటు మధురైకి చెందిన మహిళను అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు విశాఖలో శుక్రవారం డీసీపీ మేరీ ప్రశాంతి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఓ మహిళ స్కూటీపై నాలుగు ప్లాస్టిక్‌ బ్యాగులతో దువ్వాడ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా మహిళా పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్