విశాఖ కేజీహెచ్‌లో రూ. 28 కోట్లతో క్యాన్సర్ విభాగాన్ని ఆధునీకరించినట్లు సూపరిండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. ఆదివారం 30వ వార్డు సాలిపేట కమ్యూనిటీ హాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ విభాగంలో అధునాతన సాంకేతిక పరికరాలను సమకూర్చామన్నారు. వీటితో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.