తిమ్మాపురం హైవే జంక్షన్ వద్ద ఆకస్మిక తనిఖీలు

8115చూసినవారు
ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం హైవే జంక్షన్ వద్ద సోమవారం ఉదయం నుంచి పోలీసులు వాహనాల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ విభీషణరావు నేతృత్వంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ సిబ్బంది తిమ్మాపురం, కోనవానిపాలెం హైవే జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపడుతున్నామని ఎస్ఐ విభీషణరావు చెప్పారు.

సంబంధిత పోస్ట్