విశాఖలో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంద కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. తాజాగా బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహ్మాన్ కూడా వైసీపీ రాజీనామా చేసి నేడో, రేపో టీడీపీలో చేరనున్నారు. తదుపరి ఎవరంటే అనే చర్చ నడుస్తుంగా. పశ్చిమనియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆడారి ఆనంద్ కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది.