ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం 11 గంటలకు ఏవీఎన్ కళాశాల ఎదురుగా ఉన్న 37వ వార్డు సచివాలయంలో హెచ్పీవీ
(ది హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ బూస్టర్ శిబిరం నిర్వహిస్తున్నట్లు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షిరీన్ రెహమాన్ గురువారం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన 9 నుండి 14 ఏళ్ల లోపు బాలలకు హెచ్పీవీ మొదటి డోసు వేసామని రెండో డోస్ వారికి వేస్తున్నట్లు తెలియజేశారు.