విశాఖ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని, పోర్ట్ సొంత నిధులతో అభివృద్ధి చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం పోర్టు చైర్మన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ కె. కుమార్ మంగళం మాట్లాడుతూ, పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్‌ను 150 పడకల సామర్థ్యంతో నిర్మించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు.